*ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన సుబ్రమణ్యం
*అనంతబాబు బంధువులు బెదిరిస్తున్నారని ఫిర్యాదు..
*తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కలిపించాలని పోలీసులకు వినతి
*ఫిర్యాదును ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామన్న పోలీసులు
దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్యకేసులో అనంతబాబు మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.
అయితే తాజాగా అనంతబాబు బంధువులు బెదిరింపులకు పాల్పడుతున్నారని సుబ్రహ్మణ్యం బాబాయ్ శ్రీను కాకినాడ టూటౌన్ పోలీసు స్టేషన్‌లో సుబ్రహ్మణ్యం బాబాయ్ శ్రీను ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కలిపించాలని పోలీసులకు వినతి పత్రం అందజేశారు. దీంతో ఫిర్యాదును ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామని పోలీసులు హామీ ఇచ్చారు.
కాగా..అనంతబాబు బెయిల్ కోసం మరోసారి రాజమండ్రి ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతనెల 17న వైసీపీ ఎమ్మెల్సీ బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసి విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు ఉదయం రాజమండ్రి కోర్టులో అనంతబాబు తరుపు న్యాయవాదులు మరోసారి పిటిషన్ వేశారు.
బెయిల్ పిటీషన్‌పై విచారణను ఎస్సీ – ఎస్టీ కోర్ట్ న్యాయమూర్తి ఈనెల 11కు వాయిదా వేశారు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్యకేసులో అనంతబాబు మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.
తూతూ మంత్రంగానే రివర్స్ టెండరింగ్: సుజనా చౌదరి