telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నా నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ తోనే… రాజమౌళి ప్రకటన…

rajamouli

టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్ ఆర్ ఆర్ తరువాత మహేష్ బాబు తో నాసినిమా ఉంటుందని స్వయంగా రాజమౌళి అఫీషియల్‌గా ప్రకటించాడు. దుర్గ ఆర్ట్స్ బేనర్‌పై కేఎల్ నారాయణ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ‘దానయ్య గారితో సినిమా తర్వాత కే యల్ నారాయణ గారితో చేయాలి. నారాయణ గారు, నేను మహేష్ బాబు కాంబినేషన్ అని ఎప్పట్ని నుంచో చెప్తున్నదే’అంటూ ప్రముఖ టీవీ ఛానల్‌కు ఇస్తున్న ఇంటర్య్వూలో రాజమౌళి తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించిన అనేక విషయాలు వెల్లడించారు. సినిమా చాలావరకు పూర్తి అయిందన్నారు. లాక్ డౌన్ కి ముందే 80 శాతం షూటింగ్ పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం తమ టీమ్ కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారని తెలిపారు. అదే పద్ధతిన మరోవైపు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా జరుగుతోందని, అనుకున్న సమయానికే సినిమాని రిలీజ్ చేస్తాం అని చెప్పారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను కూడా ఇటీవలే రాజమౌళి విడుదల చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 8 న ఆర్ ఆర్ ఆర్ సినిమాను రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. అలానే తన తదుపరి సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మించనున్నారని అన్నారు. ఈ ప్రకటనతో మహేష్ అభిమానులు పండగ చేసుకొంటున్నారు.

Related posts