telugu navyamedia
సినిమా వార్తలు

అమితాబ్ హిట్ చిత్రం రీమేక్… హృతిక్ గ్రీన్ సిగ్నల్

Hrithik-Roshan

త్వ‌ర‌లో సూప‌ర్ 30 చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న హృతిక్ రోష‌న్ 1982వ సంవ‌త్సరంలో విడుద‌లై మంచి విజ‌యం సాధించిన “స‌త్తా పే స‌త్తా” చిత్ర రీమేక్‌లో న‌టించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఫర్హాన్ అక్తర్ నిర్మాణంలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందించేందుకు ప్రాధమిక ఏర్పాట్లు పూర్తయినట్టుగా తెలుస్తోంది. ముందుగా ఈ ప్రాజెక్ట్ కోసం షారూఖ్‌ని అనుకున్నారు కాని కథకు హృతిక్ అయితే సరిగ్గా సరిపోతాడని నిర్మాత‌లు హృతిక్‌తో చ‌ర్చ‌లు జ‌రిపార‌ట‌. ఈ ప్రాజెక్ట్‌కి హృతిక్ ఓకే చెప్పినట్టు స‌మాచారం. సినిమా షూటింగ్ ను ఈ ఏడాదిలోనే ప్రారంభించి వచ్చే సంవత్సరం విడుదల చేసే ప్లానింగ్ లో ఉంది టీమ్. “స‌త్తా పే స‌త్తా” చిత్రం అమితాబ్ కెరీర్‌లో మంచి హిట్ చిత్రంగా నిలిచిన సంగ‌తి తెలిసిందే.

Related posts