హీరో విక్రమ్ 54వ పుట్టినరోజు (ఏప్రిల్ 17) సందర్భంగా ఆయనకు అందరూ అభినందనలు తెలిపారు. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘మహావీర్ కర్ణ’. మలయాళ దర్శకుడు ఆర్‌ఎస్ విమల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. న్యూయార్క్‌కు చెందిన యునైటెడ్ ఫిల్మ్ కింగ్‌డమ్ ఈ చిత్రాన్ని దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. మహాభారతంలోని కర్ణుడి పాత్ర నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కర్ణుడిగా నటిస్తున్నారు విక్రమ్. ఇందులో సురేష్ గోపి ధుర్యోధనుడి పాత్రలో నటిస్తున్నారు. విక్రమ్ బర్త్ డే సందర్భంగా ‘మహావీర్ కర్ణ’కు సంబంధించిన ఓ చిన్న వీడియోను విడుదల చేశారు. హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. అలాగే అజయ్ జ్ఞానముత్తు డైరెక్ట్ చేస్తోన్న ‘కోబ్రా’ చిత్రంలో నటిస్తున్నారు విక్రమ్. ‘కోబ్రా’ టీమ్ కూడా విక్రమ్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేసింది.
previous post
next post