telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎస్పీ బాల సుబ్రమణ్యం విగ్రహాం ఏర్పాటు…. ఏకంగా తినే కేక్‌తోనే

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూయడంతో యావత్ సినీ లోకం విషాదంలో మునిగిపోయింది. కరోనా వైరస్ సోకడంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. మొదట జలుబు, జ్వరం వంటి స్వల్ప లక్షణాలతో బాధపడిన బాలు.. ఆగస్టు 13న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ రోజు నుంచి ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌తో పాటు ఈసీఎంవో (ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్) సపోర్ట్‌తో చికిత్స అందించారు. ఆ తర్వాత కరోనా నుంచి కోలుకున్న ఆయన.. తిరిగి అనారోగ్యం పాలై సెప్టెంబర్ 25వ తేదీన ఒంటి గంట 4 నిమిషాలకు ఆసుపత్రిలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే..  ఎస్పీ బాల సుబ్రమణ్యంకు అరుదైన గౌరవం దక్కింది. ఆయనపై ఉన్న అభిమానంతో ఏకంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఒకరిపైన అభిమానం ఉంటే… వాళ్ల కోసం ఎదైనా చేయవచ్చని నిరూపించారు. చెన్నైలో మనం తినే కేక్ తో ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటు చేశారు. పుదుచ్చేరిలోని ఓ బేకరిలో కేక్ తో బాల సుబ్రమణ్యం విగ్రహం తయారు చేశారు. 339 కిలోలతో చాక్లెట్, బాదం, ఇతర ఫేవర్స్ తో 5, 8 ఎనిమిది అంగుళాల హైట్ తో విగ్రహాన్ని రూపొందించింది ఆ బేకరీ యాజమాన్యం. ఈ విగ్రహం ఏర్పాటుకు దాదాపు 161 గంటలు పట్టింది. ఇప్పుడు ఈ విగ్రహం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. బాలు విగ్రహా కేక్ తో సెల్ఫీలు దిగుతున్నారు సంగీతం అభిమానులు. 

Related posts