telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లాక్ డౌన్ వేళ సూపర్ స్టార్ వ‌ర్కవుట్ వీడియో వైరల్

Mahesh

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు లాక్‌డౌన్ స‌మ‌యాన్ని బాగా స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. పిల్ల‌ల‌తో స‌ర‌దా స‌మ‌యాన్ని గ‌డుపుతూ… ఆ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నిన్న మహేష్ కు సంబంధించిన సెల్ఫీ ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది. ఇక తాజాగా మహేష్ బాబు వ‌ర్కవుట్స్‌కి కొంత స‌మ‌యం కేటాయిస్తున్నారు. మ‌హేష్ భార్య న‌మ్ర‌త రెగ్యుల‌ర్ యాక్టివిటీస్‌కి సంబంధించిన ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుండ‌డంతో అవి వైర‌ల్‌గా మారుతున్నాయి. న‌మ్ర‌త షేర్ చేసిన ఫోటోలని చూస్తుంటే మ‌హేష్ రోజు రోజుకి కుర్రాడిలా మారుతున్నాడా అనిపిస్తుంది. ఇందుకు కార‌ణం ఆయ‌న డైట్, వర్క‌వుట్స్ అని ఖ‌చ్చితంగా చెప్ప‌వ‌చ్చు. తాజాగా న‌మ్ర‌త త‌న ఇన్‌స్టాగ్రాములో మ‌హేష్ వ‌ర్క‌వుట్ వీడియో షేర్ చేయ‌గా ఇది వైర‌ల్‌గా మారింది.

Related posts