సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కి ముందు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆతిథ్య జట్టు ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్‌లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి డుప్లెసిస్‌ని తప్పించారు. అతని స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలను వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ క్వింటన్ డికాక్‌కి అప్పగించారు. డుప్లెసిస్‌ని పూర్తిగా జట్టు నుంచి తప్పించారు.
ఐదుగురు కొత్త ఆటగాళ్లతో ఇంగ్లండ్‌తో తలపడే సౌతాఫ్రికా జట్టును బోర్డు ప్రకటించింది. అన్ క్యాప్‌డ్ ఆటగాళ్లు లుథో సిపామ్లా, సిసండా మగలా, జోర్న్ ఫార్ట్యూన్, జానెమన్ మలన్, కైల్ వెర్రెయెన్‌లకు జట్టులో చోటు కల్పించారు.
వైసీపీ నేతలు కలలు కంటున్నారు: సోమిరెడ్డి