భారత్, న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీ 20, వన్డే , టెస్టు సిరీస్ లలో తలపడనుంది. 5మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా ఈనెల 24న ఆక్లాండ్ లో జరుగనున్న మొదటి టీ20 మ్యాచ్ తో భారత పర్యటన ఆరంభం కానుంది. అయితే ఈ పర్యటనకు ముందే భారత్ కు ఎదురు దెబ్బ తగిలింది. గత ఏడాది ప్రపంచ కప్ నుండి గాయాల బారిన పడుతూ జట్టు కు దూరం అవుతున్న స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఇటీవల ఆస్ట్రేలియా తో జరిగిన మూడో వన్డే లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడడంతో ప్రస్తుతం ధావన్ జాతీయ అకాడమీలో చికిత్స తీసుకుంటున్నాడు. దాంతో న్యూజిలాండ్ తో జరగనున్న టీ 20 సిరీస్ కు అతను దూరమైయ్యాడు.
తాజాగా జరిగిన రంజీ మ్యాచ్ లో ధావన్ సహా బౌలర్ ఇషాంత్ శర్మ కూడా గాయపడడంతో న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ కు అందుబాటులో ఉండడం లేదని సమాచారం. కాగా ధావన్ స్థానం కోసం మయాంక్ అగర్వాల్, శుభమాన్ గిల్ ,సంజు సాంసన్, పృథ్వీ షా పోటీ పడుతున్నారు. వీరు నలుగురు ప్రస్తుతం న్యూజిలాండ్ లో నే వున్నారు అలాగే ఇషాంత్ స్థానాన్ని నవదీప్ సైనీ తో భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. బీసీసీఐ ఇప్పటివరకు ఒక్క టీ 20 సిరీస్ కోసం మాత్రమే భారత జట్టును ప్రకటించింది.