telugu navyamedia
క్రీడలు వార్తలు

పీసీబీపై షోయబ్‌ మాలిక్‌ సంచలన వ్యాఖ్యలు…

పాకిస్తాన్ క్రికెట్ జట్టు తాజాగా దక్షిణాఫ్రికా, జింబాబ్వే పర్యటనలకు వెళ్లివచ్చిన సంగతి తెలిసిందే. అయిత్ తాజాగా షోయబ్‌ మాలిక్‌ మాట్లాడుతూ.. జట్టు ఎంపిక పూర్తిగా ప్రతిభ ఆధారంగానే జరగాలని, కెప్టెన్ బాబర్ అజామ్ తన జట్టును ఎన్నుకోవటానికి స్వేచ్ఛా హస్తం పొందాలని అన్నాడు. ‘మన క్రికెట్‌లో (పాక్) నచ్చడం, నచ్చకపోవడం అనే పద్దతి ఉంది. ఇది ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కూడా ఉంది కానీ మన దగ్గర ఇది ఇంకొంచెం ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది. నైపుణ్యాలకు ప్రాముఖ్యత ఇచ్చినప్పుడే మన క్రికెట్‌లో మార్పులు వస్తాయి. ఇది నిజం. అంతర్జాతీయ జట్టు అంటే.. ఎంతో పటిష్టంగా ఉండాలి. జట్టు ఎంపిక పూర్తిగా ప్రతిభ ఆధారంగానే జరిగితేనే అది సాధ్యం అవుతుంది’ అని మాలిక్ అన్నాడు. ‘ఇటీవలి జట్టులో బాబర్ ఆజమ్ ఎంచుకోవాలనుకున్న చాలా మంది ఆటగాళ్లు ఎంపిక చేయబడలేదు. ప్రతి ఒక్కరికీ వారి అభిప్రాయాలు ఉంటాయి. కాని జట్టు ఎంపికపై తుది నిర్ణయం కెప్టెన్ తీసుకోవాలి. ఎందుకంటే అతను మైదానంలో పోరాడతాడు. ఆటగాళ్ల ఎంపికలో బోర్డులో పక్షపాత ధోరణి నడుస్తుంది. ఇది సరైనది కాదు అని షోయబ్‌ మాలిక్‌ పేర్కొన్నాడు.

Related posts