telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సోనూసూద్ దాతృత్వం… బాలుడి వైద్యానికి 20 లక్షలు సాయం

Sonusood

బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. మహబూబాబాద్‌కు చెందిన నాగరాజు, లక్ష్మి దంపతుల హర్షవర్దన్‌ అనే 6 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. హర్ష వర్ధన్ ఆరున్నర నెలల వయసు నుంచే కాలేయానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నాడు. ఇక అప్పటినుంచి వైద్యులు సూచించిన మేరకు మందులు వాడుతూ వస్తున్నారు. అయితే బాలుడి పరిస్థితి తాజాగా విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ బాలుడికి కాలేయ మార్పిడి ఆపరేషన్‌ చేయాలనీ వైద్యులు సూచించారు. దీనికి గాను రూ.20 లక్షల దాకా ఖర్చవుతుందని వైద్యులు వెల్లడించారు. అంత స్తోమత లేకపోవడంతో నటుడు సోనూసూద్ ని సహాయం కోరారు. విషయం తెలుసుకున్న సోనూసూద్ బాలుడి తల్లిదండ్రులను గురువారం హైదరాబాద్‌లో కలిశారు. అయితే వైద్యానికయ్యే రూ.20 లక్షల ఖర్చులు తానే భరిస్తానని హామీ ఇచ్చారు. అల్లుడు అదుర్స్ సినిమా షూటింగ్ కోసం హైదరాబాదుకి వచ్చిన సోనూసూద్ బాలుడి సమస్యను గురించి అడిగి తెలుసుకున్నారు.

Related posts