telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

సుందర్ పిచాయ్ కి .. అదనపు బాధ్యతలు అప్పగించిన .. గూగుల్..

sundar pichai as ceo of alphabet of google

భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ ను గూగుల్ తన పేరెంట్ కంపెనీ అయిన అల్ఫాబెట్‌కు సిఈవో నియమిస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్ సహ వ్యవస్థాపకుడు అయిన సెర్జె బ్రిన్ ప్రస్తుత సీఈవో నుంచి తప్పుకుంటున్నాడు. సుందర్ పిచాయ్ గూగుల్ కు సీఈవోగా ఉంటూనే అల్ఫాబెట్‌కు కూడా సీఈవోగా వ్యవహరించాల్సి ఉంది. ఈ మేర యాక్టివ్ షేర్ హోల్డర్లు, బోర్డు మెంబర్లు, సహ వ్యవస్థాపకులు అంతా సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. పిచాయ్ మాతో 15ఏళ్లుగా కలిసి పనిచేస్తున్నాడు. అల్ఫాబెట్ ఏర్పాటులోనూ, గూగుల్ సీఈవోగా, అల్ఫాబెట్ బోర్డ్ డైరక్టర్స్‌లో సభ్యునిగా బాగా పనిచేశాం. ఇప్పుడే కాదు భవిష్యత్ లో కూడా గూగుల్, అల్ఫాబెట్‌లను లీడ్ చేసే బెటర్ పర్సన్ వేరే ఉండరని అనుకుంటున్నా’ అని మాజీ సీఈవో చెప్పారు.

సుందర్ మాట్లాడుతూ,.. గూగుల్ మీద ఫోకస్ పెడుతూనే వీలైనంత వరకూ ప్రతి ఒక్కరికీ గూగుల్ ఉపయోగపడేలా సేవలు అందిస్తాం. అల్ఫాబెట్ లాంటి బిగ్ ఛాలెంజ్ తీసుకోవడం ఎగ్జైటింగ్ గా ఫీలవుతున్నా. అందరికీ థ్యాంక్స్’ అని పిచాయ్ చెప్పుకొచ్చాడు. అల్ఫాబెట్ సంస్థ వామో(సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్), వెరిలీ(లైఫ్ సైన్సెస్), కాలికో (బయో టెక్ ఆర్&డీ), సైడ్ వాక్ లాబ్స్(అర్బన్ ఇన్నోవేషన్, లూన్(రూరల్ ఇంటర్నెట్ యాక్సెస్ వయా బెలూన్)ను వంటి ఉత్పత్తులు కొనసాగిస్తోంది. సుందర్ పిచాయ్.. 1972 జూన్ 10న తమిళనాడులోని మధురైలో జన్మించారు. ఖరగ్ పూర్‌లోని ఐఐటీలో మెటలార్జికల్ ఇంజినీరింగ్ చదువుకున్నారు. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎమ్మెస్ పూర్తి చేశారు. 2015లో పిచాయ్ గూగుల్ కు సీఈవోగా నియమితులయ్యారు.

Related posts