telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

బీసీ సీఎం పై సోము వీర్రాజు కొత్త మాట…

బీసీ సీఎం అని కొత్త పల్లవి అందుకున్నారు సోము వీర్రాజు. దేశంలో బీసీలు బీజేపీతోనే ఉన్నారని.. పార్టీ ఒక బీసీని ప్రధానిని చేసిందని చెప్పారాయన. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీలు బీసీని ముఖ్యమంత్రిగా చేయగలవా అని ఆయన ఛాలెంజ్‌ కూడా చేశారు. అంతేకాదు బీసీలను సీఎం చేసే దమ్ము ఒక్క బీజేపీకే ఉందని నిన్న వ్యాఖ్యానించారు సోము వీర్రాజు.  అయితే.. తాజాగా బీసీ సీఎంపై మాటమార్చారు సోము వీర్రాజు.  ఏపీలో సీఎం అభ్యర్థి ఎవరు అనేది తన చేతుల్లో లేదని ఇవాళ చెప్పారు సోము వీర్రాజు. సీఎం అభ్యర్థి ఎవరో నడ్డా, పవన్‌ కళ్యాణ్‌ కలిసి నిర్ణయిస్తారని పేర్కొన్నారు. సీఎంగా బీసీలు కావొచ్చు, కాపులు కావొచ్చని క్లారిటీ ఇచ్చారు. నిన్న బీసీలను సీఎం చేస్తానన్న సోము వీర్రాజు…. 24 గంటల్లో మరో మాట మాట్లాడటం ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక బిజెపి నోటా పార్టీ అంటూ అధికార పార్టీ చేసిన కామెంట్లపై సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. బిజెపిని నోటా అంటున్న మంత్రి వెల్లంపల్లి మా పార్టీ నుంచి గతంలో పోటీ చేశారు అంటూ గుర్తు చేశారు. కేవలం 3 వేల ఒట్లతో ఓడిన విషయం వెల్లంపల్లికి తెలియదా అంటూ ప్రశ్నించారు. అప్పుడు బిజెపి నోటా పార్టీ కాదా అంటూ ప్రశ్నించారు. మంత్రులు జాగ్రత్తగా మాట్లాడాలి అంటూ ఘుటుగా హెచ్చరించారు.

Related posts