సీఎం కాకపోతే రాజకీయాల్లోంచి వెనక్కి వెళ్లి పోయేందుకు పార్టీ పెట్టలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సరిగా పనిచేయకపోతే సీఎం చొక్కా పట్టుకునే విధంగా యువకులను తయారు చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కల్యాణ్ అన్నారు.
కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా జనసేనాని ఆదివారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించారు. 80 మంది కౌలు రైతులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..పాదర్స్ డే రోజున పిల్లలకు న్యాయం జరగాలనే ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు.
ఏ ప్రభుత్వం కౌలు రౌతులకు గుర్తింపు పత్రాలు ఇవ్వలేదు..కౌలు రైతులకు ఎటువంటి గుర్తింపు కార్డులు ఉండవని అందరికీ తెలుసు..ఒక్క సీఎం జగన్ కు తప్ప..
మూడేళ్లలో మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు . ఏ హామీలు అమలు పర్చలేని అసమర్థ ప్రభుత్వమిది అని పవన్ అన్నారు. వైసీపీ నేతలను ప్రశ్నిస్తే సంస్కారహీనంగా మాట్లాడుతున్నారన్నారు. డబ్బు మదంతో ఒళ్లు బలిసి కొట్టుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఏదైనా మాట్లాడితే దత్తపుత్రుడు అంటూ విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం జరగనప్పుడు ఎవరో ఒకరు ప్రశ్నించాలని, అందుకే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
నేను ఎవరికి దత్తపుత్రుడుని కాదు..ప్రజలకు మాత్రమేదత్త పుత్రుడని అన్నారు. మిమ్మల్ని సీబీఐ దత్తపుత్రుడు అంటే సహించలేరని పవన్ దుయ్యబట్టారు. ఓదార్పు యాత్రలు చేసి ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చారంటూ జనసేనాని సెటైర్లు వేశారు.
యువకులకు ఏదైనా ఉద్యోగం రావాలంటే ఎలాంటి క్రిమినల్ కేసులు ఉండకూడదన్నారు. కానీ, క్రిమినల్ కేసులు ఉన్న వారు ఎమ్మెల్యేలు ఎలా అవుతున్నారని ప్రశ్నించారు.
యువకులకు ఏదైనా ఉద్యోగం రావాలంటే ఎలాంటి క్రిమినల్ కేసులు ఉండకూడదన్నారు. కానీ, క్రిమినల్ కేసులు ఉన్న వారు ఎమ్మెల్యేలు ఎలా అవుతున్నారని ప్రశ్నించారు.
కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు వ్యవస్థలను ఉపయోగించరని ఆయన మండిపడ్డారు. కక్ష సాధింపు కోసమే వ్యవస్థల్ని వాడుతారంటూ పవన్ ఆరోపించారు. తనకు డబ్బు అవసరం లేదని.. వచ్చే ఎన్నికలు చాలా కీలకమైనవని.. వైసీపీకి ఓటేస్తే రాష్ట్రానికి తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు. తనను నమ్మాలని, ఆలోచించాలని పవన్ కోరారు.
వైసీపీకు రూ.లక్ష కోట్లు దోపిడీ చేసే సత్తా ఉన్నప్పుడు జనసేనకు 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చే సత్తా ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా జనసేనాని ఆదివారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించారు.
యువకులకు ఏదైనా ఉద్యోగం రావాలంటే ఎలాంటి క్రిమినల్ కేసులు ఉండకూదన్నారు. మరి ఎమ్మెల్యేలకు ఇవి వర్తించవా అంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
క్రిమినల్ కేసులు ఉన్న వాళ్లు ఎమ్మెల్యేలు ఎలా అవుతారని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులకు ఒక రూల్ సామాన్యులకు మరొక రూలా అని నిలదీశారు. ఒకసారి గెలిస్తే ఐదేళ్లపాటు ఏంచేయలేరనే ధీమాతో వారంతా ఉంటారని, సరిగా పనిచేయకపోతే రెండేళ్ల తర్వాత రీకాల్ చేసే చట్టం రావాలని పవన్ సూచించారు.
జనసేనకు పొత్తు ప్రజలతోనే ఇంకెవరితోనూ లేదన్నారు. 2009లో ఏం చెప్పానో అదే చేస్తానన్న ఆయన… ప్రజలకోసం ప్రత్యేక హోదాకోసం ప్రధానమంత్రితో విభేదించానన్నారు. రాజకీయాల్లో ప్రజలు ముందుకెళ్లేలా చేయడమే తన తపన అన్నారు.
దసరా తర్వాత వైసీపీ నాయకుల సంగతి చూస్తానన్నారు. అప్పటి వరకు వైసీపీ నేతలు ఏం మాట్లాడినా భరిస్తానని పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. విభజన జరిగినప్పటి నుంచి రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందన్న పవన్… కేంద్రాన్ని నిందించడం కాదు మన బంగారం మంచిదవ్వాలన్నారు.
హైకోర్టు వ్యాఖ్యలకు ప్రభుత్వం సిగ్గుపడాలి: యనమల