వర్షాకాలం వచ్చిందంటే చర్మానికి సబంధించిన పలు సమస్యలు చుట్టు ముడుతుంటాయి. ఈ సీజన్‌లో గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల చర్మం జిడ్డుగా మారుతుంది. ఇది ముఖంపై మొటిమలు, మంటలు, పగుళ్లు మొదలైన వాటికి దారితీస్తుంది. అయితే ఈ సీజన్‌లో చర్మ సంరక్షణకు తేలికపాటి ఫార్ములేషన్‌లతో తయారు చేసిన బ్యూటీ సొల్యూషన్‌ని ఎంచుకోవాలి. ఇందుకు హైల్యూరోనిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్ వంటివి ఉండే ఫేస్ సీరం ఆయిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది మీ చర్మాన్ని జిడ్డుగా మార్చకుండా హైడ్రేట్, ఎక్స్‌ఫోలియేట్‌గా చేస్తుంది. వీటిలోని విటమిన్ సి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. తద్వారా మీ చర్మంపై ఉన్న మచ్చలు తగ్గడంతో పాటు చర్మం సహజంగా మెరిసిపోతుంది.
సీరమ్ ఆయిల్ అన్ని రకాల చర్మాలపై సాలిసిలిక్ యాసిడ్ సీరం బాగా పని చేస్తుంది. ఇది మీ చర్మంపై జిడ్డును తొలగించి తేలికపాటి మాయిశ్చరైజేషన్ వలే పనిచేస్తుంది. తద్వారా ముఖంపై మొటిమలు, మచ్చలు, రంధ్రాలను తొలగిస్తుంది. అంతేకాదు, విటమిన్ సితో కూడిన ఈ సీరం ఆయిల్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మీ చర్మాన్ని కాంతివంతగా చేస్తుంది. సీరమ్‌లను నీరు, ఎమల్షన్తో తయరు చేస్తారు. అందువల్ల అవి తేలికపాటి జెల్ వలే పనిచేస్తాయి. ఇది చర్మంపై ఎక్కువ సేపు నిలిచి ఉండదు. సీరం ఆయిల్ ఇతర బ్యూటీ క్రీమ్‌లు లేదా మాయిశ్చరైజర్‌ల కంటే బాగా పనిచేస్తుంది. కేవలం ఒకటి లేదా రెండు చుక్కల సీరంతో మీ చర్మాన్ని ప్రకాశవంతం చేయవచ్చు.