telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

ఈ కొబ్బరి తింటే.. ఎంత ఆరోగ్యమో తెలుసా..!

fresh coconut water and peal is very healthy

ఈసారి ప్రారంభం నుండే ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. ఇక ముందుముందు ఈ తీవ్రత పెరుగుతుందే తప్ప తగ్గేప్రసక్తి అయితే ఉండదు. మరి ఇంత ఎండలలో తగిన జాగర్తలు తీసుకోకుంటే.. అనారోగ్యానికి ఆహ్వానం పలికినట్టే. ఎండాకాలం ఎండల నుండి ఉపశమనం పొందేందుకు అనేక రకాల కూల్‌ డ్రింక్స్‌ను జనాలు ఆశ్రయిస్తారు. అయితే సహజసిద్దమైన డ్రింక్‌ అయిన కొబ్బరి నీటిపై మాత్రం ఎక్కువ శాతం జనాలు ఆసక్తి చూపించరు. ఆ జ్యూస్‌ ఈజ్యూస్‌ అంటూ తాగుతారు తప్ప ఆరోగ్యానికి ఎంతో మంచిది అయిన కొబ్బరి నీళ్లు మాత్రం తాగరు. కొబ్బరి నీరు వేడి చేసిన వారికి వెంటనే ఉపశమనం కలిగించడంతో పాటు, ఎనర్జి డ్రింక్‌ గా కూడా ఉపయోగపడుతుంది. ఇక కొబ్బరి నీటితో పాటు కొబ్బరి బోండాంను పగులకొట్టి దాంట్లో ఉన్న కొబ్బరిని తింటే ఇంకా చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి.

లేత కొబ్బరిలో ఉన్న ప్రయోజనాలు :

* మలబద్దకంతో బాధపడే వారికి లేత కొబ్బరి మంచి ఔషదంగా పని చేస్తుంది. అజీర్తి మరియు జీర్ణంకు సంబంధించిన సమస్యలను లేత కొబ్బరి దూరం చేస్తుంది.

* లేత కొబ్బరిలో విటమిన్‌ ఏ, బీ, సీ, థయామిన్‌, రైబోప్లావిన్‌, నియాసిన్‌, క్యాల్షియం, కార్బోహైడ్రేడ్‌, ఐరన్‌ లు అధిక పరిమాణంలో ఉంటాయి. కనుక ఇది ఆరోగ్యకరమైన ఫుడ్‌.

fresh coconut water and peal is very healthy* పురుషుల్లో లైంగిక శక్తిని పెంచడంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతోంది. ఈమద్య కాలంలో చాలా మంది పురుషులు ఎదుర్కొంటున్న సమస్య స్పెర్మ్‌ కౌంట్‌ ను కూడా ఇది పెంచుతుంది.

* లేత కొబ్బరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు చాలా మంచివి. గుండెకు సంబంధించిన పలు అనారోగ్య సమస్యలను ఈ లేత కొబ్బరి తీర్చేస్తుంది.

* బరువు తగ్గాలనుకునే వారు లేత కొబ్బరి తింటే చాలా మంచి ఫలితం ఉంటుంది.

* ఎండాకాలం డీ హైడ్రేషన్‌ నుండి తప్పించుకోవడానికి లేత కొబ్బరి తింటే మంచిది.

* లేత కొబ్బరి మంచి పీచు పదార్థం. అందువల్ల ఇది శరీరంలోని కొవ్వును కరిగించి జీర్ణ వ్యవస్థ సరిగా అయ్యేలా చేస్తుంది. ఇంకా పలు లాభాలు లేత కొబ్బరి వల్ల ఉన్నాయి.

అందుకే ఈసారి కొబ్బరి బొండాను కొట్టించుకుని నీళ్లు తాగిన తర్వాత మొహమాటం లేకుండా బొండాను పగుల కొట్టించుకుని అందులోని లేత కొబ్బరిని తప్పకుండా తినండి.

Related posts