ఎప్పుడు ఎదో వివాదల్లో నిలిచే హీరోయిన్ సంజనకు మరో కొత్త సమస్య ఎదురైంది. తెలుగులో ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో హీరోయిన్ త్రిష చెల్లిలి పాత్రలో నటించి ప్రేక్షకులు ఆదరణ పొందింది. ఆసినిమా తరువాత తెలుగులో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో కన్నడలో సెటిల్ అయ్యింది. అక్కడ పలు సినిమాల్లో మంచి సక్సెస్‌ను అందుకుంది.
అయితే కొన్ని రోజుల క్రితం కన్నడ ఇండస్ట్రీలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో సంజన అడ్డంగా బుక్ అయింది. ఈ కేసులో ఆమె పాత్ర ఉందని తేలడంతో జైలుకు కూడా వెళ్లి బెయిల్ బయటకు వచ్చింది. అంతలోనే ఆమె పై కొన్ని చీటింగ్ ఆరోపణలు రావడం.. ఇలా అనేక చేదు అనుభవాల మధ్య సడెన్ గా గత ఏడాది చిన్ననాటి స్నేహితుడైన అజీజ్ పాషాను పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది.
అయితే సంజనా, అజీజ్ పాషాతో పెళ్లి తర్వాత మీడియాకి దూరంగా ఉంది. కానీ పుకార్లు మాత్రం ఆమెను వదలడం లేదు. పెళ్లి అయి ఏడాది కూడా కాలేదు. ఇంతలోనే సంజనాకి ఆమె భర్తతో గొడవలు ఉన్నట్టు టాక్ వినిపిస్తున్నాయి. మొత్తంగా సంజనా జీవితం గత రెండేళ్లలో చాల మలుపులు తిరిగిందని చెప్పొచ్చు.