telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పవన్ ప్రచార వాహనం నుంచి పొగలు..

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో జనసేయన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ శ్రీకాకుళంలో నిర్వహించిన సభలో  అపశృతి చోటుచేసుకుంది. ప్రజలనుద్దేశించి ప్రచార రథం పై ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా వాహనం నుంచి పొగలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన ఆయన వాహనం దిగి తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హానీ జరగకపోవడంతో పోలీసులు, జనసేన కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. ఇంజిన్‌ వేడెక్కడం వల్లే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ పొగలు వ్యాపించినట్టు తెలుస్తోంది.

Related posts