2020లో టాలీవుడ్ హీరోల ఇంట వరుసగా పెళ్లిబాజాలు మోగుతున్నాయి. ఇప్పటికే నిఖిల్ సిద్ధార్థ్, నితిన్, రానా దగ్గుబాటి వివాహలు చేసుకొని ఓ ఇంటివారు కాగా… మరోవైపు మెగా డాటర్ నిహారిక ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. ‘కృష్ణా అండ్ హిజ్ లీల’ నటి షాలిని తమిళ దర్శకుడు మనోజ్‌తో ఏడడుగులు వేసేసింది. తాజాగా మరో యువ కథానాయకుడు శర్వానంద్ కూడా పెళ్లి పీటలెక్కనున్నట్లు సమాచారం. ఆయన చిన్ననాటి స్నేహితురాలు, మహిళా పారిశ్రామికవేత్తతో ప్రేమ వివాహం జరగనుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే శర్వానంద్ అధికారిక ప్రకటన చేసే వరకు వేచి చూడాల్సిందే. కాగా శర్వానంద్ ప్రస్తుతం “శ్రీకరం” అనే చిత్రంలో నటిస్తున్నారు. సాయికుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘గద్దలకొండ గణేష్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తోన్న రెండో చిత్రమిది.
బిగ్ బాస్-3 : రాహుల్ ప్రపోజ్ చేస్తే… పునర్నవి కామెంట్స్