telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు

లైంగిక దాడి కేసు.. హోంగార్డుకి 30 ఏళ్ల జైలు

లైంగిక దాడి కేసులో నిందితుడికి 30 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తుకారాంగేట్‌ వద్ద బాలికపై హోంగార్డు మల్లికార్జున్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఫిబ్రవరి 19న హోంగార్డు మల్లికార్జున్‌ను అరెస్ట్‌ చేశారు. అనంతరం బాలిక గర్భం దాల్చడంతో మెడికల్‌, ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టులతో పాటు అన్ని ఆధారాలు సేకరించి పోలీసులు కోర్టులో సమర్పించారు. నిందితుడు మల్లికార్జున్‌కు 30 ఏళ్ల జైలుశిక్షతోపాటు బాధితురాలి కుటుంబానికి రూ.40 వేలు చెల్లించాలని ఆదేశించింది.

Related posts