telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎంత నష్టం అంటే…?

lockdown corona

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ లో దారుణంగా విజృంభిస్తోంది.  రోజూ లక్షలాది కేసులు నమోదవుతున్నాయి.  కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో చాలా రాష్ట్రాల్లో పాక్షిక, వీకెండ్ లాక్ డౌన్ వంటివి విధిస్తున్నారు.  దీంతో ఆయా రోజుల్లో అక్కడ ఎలాంటి వ్యాపారలావాదేవీలు జరగడం లేదు.  ఫలితంగా ఆర్ధికంగా వ్యవస్థ కుదేలవుతున్నది.  ఇలానే పాక్షిక లాక్ డౌన్ ను విధిస్తే దాని ఫలితం తీవ్రంగా ఉంటుందని ఎస్బిఐ రీసెర్చ్ తాజా నివేదికలో పేర్కొన్నది.  పాక్షిక లాక్ డౌన్ వలన దాదాపుగా రూ.1.5 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది.  లాక్ డౌన్ విధించడం కంటే వీలైనంత త్వరగా అందరికి టీకాలు వేయడం ఉత్తమం అని ఆర్ధికంగా దోహదం చేస్తుందని ఎస్బీఐ రీసెర్చ్ పేర్కొన్నది.  టీకాల కోసం జీడీపీలో 0.1 శాతం మాత్రమే ఖర్చు అవుతుందని, లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే జీడీపీపై 0.7 భారం పడిందని ఎస్బిఐ నివేదికలో పేర్కొన్నది. అయితే అలా దేశంలో పూర్తి లాక్ డౌన్ విధిస్తే ఇంకా ఎంత నష్టం జరుగుతుందో మరి.

Related posts