telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పది వేల మందికి డయాలసిస్‌ నిర్వహిస్తున్నాం: మంత్రి ఈటల

Etala Rajender

పది వేల మంది కిడ్నీరోగులకు డయాలసిస్‌ నిర్వహిస్తున్నామని తెలంగాణ వైద్య, ఆరోగ్య రోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈటల సమాధానమిస్తూ ఒక్కో కిడ్నీ పేషెంట్‌పై ఏడాదికి రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షలు ఖర్చు పెడుతున్నామని తెలిపారు. కిడ్నీ రోగుల సమస్యలను గుర్తించేదుకు సీఎం కేసీఆర్‌ డయాలసిస్‌ కేంద్రాల ఏర్పాటుకు ఆదేశించారని, రాష్ట్రంలో డయాలసిస్‌ సెంటర్లు ఇంకా పెంచుతామన్నారు.

కిడ్నీ రోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి ఈటల భరోసానిచ్చారు. జీహెచ్‌ ఎంసీలోని మురికివాడల పేదలకు వైద్య సేవలందించేందుకు 106 బస్తీ ఆసుపత్రులను ఏర్పాటు చేశామని, యూపీహెచ్‌సీల్లో ఉండే అన్ని మందులు బస్తీ దవాఖానాల్లో ఉన్నాయి. ఖమ్మం, కరీంనగర్‌, మంచిర్యాల లేదు రామగుండంలో మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు ప్రతిపాదనలను పంపించినట్లు తెలిపారు.

Related posts