టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి నేటికి 12 ఏళ్లు పూర్తి అవుతుంది. గౌతమ్‌మీనన్ దర్శకత్వం వహించిన ఏమాయ చేశావే సినిమాతోనే సమంత తెరంగేట్రం చేసింది. ఈ రొమాంటిక్ చిత్రం విడుదలైన నేటికి 12ఏళ్లు అయింది. ఈ సందర్భంగా తన సినీ జర్నీని తెలియజేస్తూ సామ్ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసుకుంది.
‘చిత్ర పరిశ్రమలో నటిగా నా ప్రయాణం మొదలై నేటికి 12 సంవత్సరాలు. లైట్స్, కెమెరా, యాక్షన్..అనే మూడు మార్చలేని పదాలతో నా లైఫ్‌లో ఇక్కడి వరకు చేరుకున్నాను. వీటి చుట్టూ నాకున్న మధుర ఙ్ఞాపకాలు, అద్భుతమైన అనుభూతులకు 12 ఏళ్లు. ఇన్నేళ్ల ప్రయాణంలో ప్రపంచ వ్యాప్తంగా నిస్వార్థమైన అభిమానులను పొందినందుకు ఆనందంగా ఉంది. సినిమాపై నాకున్న ప్రేమ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా’ అంటూ సమంత పేర్కొంది.
ఈ సినిమా కోసమే నాగచైతన్య-సమంత మొదటిసారి కలిసి పనిచేసింది. ఈ సినిమా షూట్‌లోనే వాళ్లిద్దరూ స్నేహితులయ్యారు. గతేడాది వాళ్లిద్దరూ తమ వైవాహిక బంధానికి ఫుల్‌స్టాప్ చెప్పిన క్రమంలో సమంత.. తన తొలి చిత్రం గురించి పోస్ట్ పెట్టడం వల్ల.. ఇప్పుడు ఇది కాస్త వైరల్‌గా మారింది.
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతూ బాగా వైరల్ అవుతోంది. కాగా, సమంత త్వరలో ‘శాకుంతలం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇటీవలే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై ఆకట్టుకుంది.
Today marks my 12th year in the Film Industry. It’s been 12 years of memories that revolve around Lights, Camera, action and incomparable moments. I am filled with gratitude for having had this blessed journey and the best, most loyal fans in the world ! pic.twitter.com/2kVjAenIQu
— Samantha (@Samanthaprabhu2) February 26, 2022