telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ క్రికెటర్ అంటే చాలా ఇష్టం… ఎంతో మందిలో స్ఫూర్తిని నింపారు : దీపికా పదుకొనె

Deepika-Padukone

యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ యదార్థ జీవితకథ ఆధారంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోనే నటించిన చిత్రం “ఛపాక్”. మేఘనా గుల్జార్ తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో యాసిడ్ బాధితురాలిగా దీపిక కనిపించింది. తాజాగా విడుదలైన ట్రైలర్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. “ఛపాక్” వచ్చే నెల పదో తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న దీపికా క్రీడా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిందన్న విషయం తెలిసిందే. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాష్ పదుకొనే కుమార్తె అయిన దీపికకు క్రికెట్ అంటే చాలా ఆసక్తి. తాజాగా ఓ క్రికెట్ లైవ్ షోకు భర్త రణ్‌వీర్‌తో కలిసి హాజరైన దీపిక తనకిష్టమైన క్రికెటర్ గురించి మాట్లాడింది. “నాకు, రణ్‌వీర్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. మేమిద్దరం కలిసి మ్యాచ్‌లను వీక్షిస్తుంటాం. నాకు రాహుల్ ద్రవిడ్ అంటే చాలా ఇష్టం. బెంగళూరుకు చెందిన ద్రవిడ్ నాతోపాటు ఎంతో మందిలో స్ఫూర్తిని నింపారు” అని దీపిక చెప్పింది.

Related posts