telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో బ్యూటీతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత

Samantha

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పెళ్ళి తరువాత వరుస హిట్లను అందుకుంటూ టాప్ రేంజ్ లో దూసుకెళ్తోంది. స‌మంత‌ ప్ర‌స్తుతం 96 రీమేక్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు 96 రీమేక్ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంతో పాటు “ది ఫ్యామిలీ మ్యాన్” సీజ‌న్ 2 వెబ్ సిరీస్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడికి బాలీవుడ్ నుంచి ఆఫర్ రాగా, దానిని సున్నితంగా తిర‌స్క‌రించింద‌ట‌. అయితే షూటింగ్స్‌కి కాస్త బ్రేక్ ఇచ్చిన స‌మంత తాజాగా తిరుమ‌ల‌కి వెళ్ళింది. త‌న ఫ్రెండ్ రమ్యా సుబ్ర‌మ‌ణియ‌న్‌తో క‌లిసి శ్రీవారిని ద‌ర్శించుకుంది. కాలి న‌డ‌క‌న తిర‌మల‌కి వెళ్ళి శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ట్టు తెలుస్తుంది. ర‌మ్య త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో స‌మంత‌తో దిగిన ఫోటోలు షేర్ చేయ‌డంతో అవి వైర‌ల్‌గా మారాయి. ర‌మ్య త‌న కెరీర్‌ని యాంక‌ర్‌గా ప్రారంభించ‌గా, ఆ త‌ర్వాత ప‌లు సినిమాల‌లో న‌టించింది. ప్ర‌స్తుతం విజ‌య్ 64వ సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తుంది. మ‌జిలి సినిమా రిలీజ్ ముందు స‌మంత, చిత్ర యూనిట్‌కి సంబంధించిన కొంద‌రు కాలిన‌డ‌క‌న అలిపిరి నుండి తిరుమ‌ల‌కి వెళ్ళిన సంగ‌తి తెలిసిందే.

Related posts