telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఇండోనేషియా : మూడు రోజులో రెండుసార్లు భూకంపం

ఇండోనేషియాలో మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు భూకంపం వచ్చింది. సులవేసి అనే ద్వీపంలో 6.2 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో వందకు పాగా కట్టడాలు కూలిపోగా 35 మంది మృతి చెందారు మరియు వందలాది మంది గాయపడ్డారు. అయితే ఈ భూకంపం తెల్లవారుజామున 1.30కి ప్రజలు మంచి నిద్రలో ఉండగా రావడంతో చాలా మంది కూలిపోయిన భావన శిథిలాల కింద చిక్కుకపోయారు. దాంతి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ భూ ప్రకంపనల కారణంగా మూడు కొండచరియలు విరిగిపడగా కొన్ని ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అలాగే కొన్ని వంతెనలు దెబ్బతిన్నాయి. ఇక ఇదే చోట గత గురువారం మధ్యాహ్నం కూడా 5.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలవబడే ఇండోనేషియా క్రమం తప్పకుండా భూకంపాలకు గురవుతుంది. 2018 లో కూడా ఇక్కడ 6.2 తీవ్రతతో భూకంపం రావడంతో సునామీ కూడా వచ్చి వేలాది మంది మృతి చెందారు. అయితే విపత్తు ఏజెన్సీ అధిపతి మరియు సామాజిక వ్యవహారాల మంత్రి చిత్రాలు సోషల్ మీడియాలో పెట్టారు. అందులో మోటారు సైకిళ్ళపై నివాసితులు ఎత్తైన భూమికి పారిపోతున్నట్లు వీడియోలు ఉన్నాయి., మరియు ప్రజలు తమ చేతులతో శిధిలాలను తొలగించడానికి ప్రయత్నించినప్పుడు తీసిన చిత్రాలు ఉన్నాయి.

Related posts