telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

తెలంగాణలో ఆర్టీసీ డ్రైవింగ్ స్కూళ్లు..!

rtc protest started with arrest

తెలంగాణలో ఆర్టీసీ డ్రైవింగ్ స్కూళ్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు ప్రైవేటు సంస్థలు మాత్రమే డ్రైవింగ్ స్కూళ్ళను నిర్వహిస్తుండగా ఇక ఆర్టీసీ కూడా ఈ స్కూళ్ళను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. .ప్రస్తుతానికి హైదరాబాద్‌లో రెండు, వరంగల్‌లో ఒకటి చొప్పున ఈ స్కూళ్ళను ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్ధులకు నాణ్యమైన ప్రమాణాలతో కూడి డ్రైవింగ్‌ను నేర్పించడంతోపాటు ఆర్ధిక సంక్షోభం నుంచి కొంతమేరకైనా బయటపడాలన్న ఉద్దేశంతో సంస్థ ఈ డ్రైవింగ్ స్కూళ్ళను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

కరోనా వ్యాప్తి నేపధ్యంలో గత రెండు నెలలుగా ఆర్టీసీ రూ. 700 కోట్ల మేరకు ఆదాయాన్ని కోల్పోయింది. ప్రస్తుతం నడుస్తోన్న బస్సులతో కేవలం రూ. 5 కోట్ల ఆదాయం మాత్రమే వస్తోంది. ఈ క్రమంలో యాజమాన్యం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది. ఈ క్రమంలోనే త్వరలో మూడు డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాలను ప్రారంభించనుంది. ఇందులో తేలికపాటి వాహనాలైన కార్లతో పాటు భారీ వాహనాలను నడిపేలా ప్రైవేటు వ్యక్తులకు శిక్షణనిచ్చేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది.

Related posts