telugu navyamedia
సామాజిక

మ‌ట్టి వినాయ‌కుడునే ఎందుకు పూజించాలి..?

వినాయక చవిత ఉత్సవాలకు దేశం యావత్తు సిద్ధమవుతోంది. వినాయకచవితి అంటే అది ప్రకృతితో ముడిపడి ఉన్న పండుగ.. సంప్రదాయాల పండగలు పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన తరుణమిది. పర్యావరణం పరంగానే కాదు, ఆధ్యాత్మిక పరంగానూ మనం మట్టితో తయారు చేసిన వినాయకుడి విగ్రహాలనే పూజించాలి.

Vinayakachavithi on 13th - Sakshiప్రతి ఏటా వినాయకచవితికి మట్టి విగ్రహాలను పూజించాలని ఎంత మంది ఎన్నిసార్లు చెప్పినా.. ఇప్పటికీ అనేక చోట్ల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలనే ఉపయోగిస్తున్నారు. దీంతో పర్యావరణ కాలుష్యం ఏటా విపరీతంగా పెరుగుతోంది. దాంతో అనేక దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి. అయితే పర్యావరణం పరంగానే కాదు, ఆధ్యాత్మిక పరంగానూ మనం మట్టితో తయారు చేసిన వినాయకుడి విగ్రహాలనే పూజించాలి.

సకల ప్రాణాలు మట్టిలోంచే వచ్చాయని, పార్వతి దేవి వినాయకుడిని మట్టితోనే తయారు చేసి ప్రాణం పోస్తుంది. అందువల్ల మనం వినాయకుడ్ని పూజిస్తే సాక్షాత్తూ ప్రకృతిని పూజించినట్లే అవుతుంది. మట్టి అంటే.. పవిత్రం.. అలాంటి మట్టితోనే గణ‌ప‌తిని తయారుచేయాలి.. పూజించాలని శాస్త్రం చెబుతోంది.. స్వచ్ఛమైన పవిత్ర కణాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన దాని కంటే కూడా మట్టితో చేసిన విగ్రహం వైపు ఎక్కువ ఆకర్షితమౌతాయి.

Youth For Seva on Twitter: "Clay Ganesha workshops are organised by Youth for Seva to train volunteers in making Clay Ganesha . Here are a few snippets !!! ⁣⁣#yfs #ganesha #clay #workshop #

మట్టి నీటిలో వెంటనే కరిగిపోతుంది.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నీటిలో తేలికగా కరుగదు.. అందువల్ల విగ్రహం నిమర్జనం తర్వాత నీటిపై తేలుతుంది. కొన్నిసార్లు నగరాల్లో, ఎక్కువ కాలం నీటిలో కరగని విగ్రహాల అవశేషాలు సేకరించి వాటిని బురదగా మార్చడానికి బుల్డోజర్ వంటి వాటిని నడుపుతారు. దేవత విగ్రహాలకు తీవ్ర అవమానంతో సమానమైనది.

మరోవైపు మట్టి గణపతిని పూజించి, పర్యావరణాన్ని కాపాడాలని ప్రభుత్వాలు, పలు స్వచ్ఛంద సంస్థలు కూడా చైతన్యం తీసుకురావడానికి తీవ్రంగా క షి చేస్తున్నాయి. దీన్ని మరో జాతీయ ఉద్యమంలా ఉరుకులు పెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎలాంటి మంచిపనికైనా మొదట్లో కొన్ని ఇబ్బందులు తప్పవు..ఆచరిస్తే ఇది పెద్ద కష్టమైన పనేం కాదు.

Ganesh Pooja Kit online - Aaradhya.in

విగ్రహం సరిగ్గా మునగాలి.. లేదంటే దేవతను అగౌరవపరిచినదానితో సమానం.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌ను నీటిలో కలపడం వల్ల నది, సముద్రం, సరస్సు అంతా కలుషితం అవుతాయి.. జీవుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల ఈ వినాయకచవితికి అందరూ మట్టి విగ్రహాలనే పూజించండి…వినాయకుడి కృపకు పాత్రులు కండి..!

Related posts