telugu navyamedia
రాజకీయ వార్తలు

డొనాల్డ్ ట్రంప్ సోదరుడు మృతి

Trump Brother

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంలో విషాదం నెలకొంది. ట్రంప్ తమ్ముడు రాబర్ట్ ట్రంప్ అనారోగ్యంతో మృతి చెందారు. రాబర్ట్ ట్రంప్ వయసు 71 సంవత్సరాలు. పారిశ్రామికవేత్త అయిన రాబర్ట్ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత కొన్నినెలలుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్యం క్షీణించడంతో శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు.

సోదరుడి మృతి పట్ల ట్రంప్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. “రాబర్ట్ నా తమ్ముడు మాత్రమే కాదు, నాకు ఆప్త మిత్రుడు కూడా అని అన్నారు తమ్ముడి జ్ఞాపకాలు నా మనసు నుంచి వీడిపోవు. రాబర్ట్ ఎంతో శాంత స్వభావి. నా లైఫ్ లో నేను హనీ అని పిలిచే ఏకైక వ్యక్తి రాబర్ట్ మాత్రమే అని తెలిపారు. రాబర్ట్ ట్రంప్ చివరి క్షణాల్లో ఉన్నారని తెలియడంతో శుక్రవారం ఆయన ఆసుపత్రికి వెళ్లి తమ్ముడ్ని కడసారి పరామర్శించారు.

Related posts