telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం : స్పాట్ లోనే ముగ్గురు మృతి

రోడ్డు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలను అమలు చేసినా.. ఓవర్‌ స్పీడ్‌తో వెళ్లి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే..తాజాగా ఏపీలోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని సత్తెనపల్లి మండలం నందిగామ వద్ద కూలీలతో వెళుతున్న ఆటోను కారు ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. పలువురు కూలీలు గాయపడ్డారు. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని వెంకటేశ్వర్లు, నాగరాజు, అలివేలుగా గుర్తించారు పోలీసులు. వీరంతా ముప్పాళ్ల మండలం మాదల గ్రామానికి చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related posts