telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సీఎం జగన్ నమ్మకాన్ని వమ్ము చేయబోను..

సీఎం జగన్ నమ్మకాన్ని వమ్ము చేయబోనని.. రాష్ట్రంలో ఉన్న వనరులను ఉపయోగించి అభివృద్ధి చేస్తామని మంత్రి ఆర్కే రోజా వెల్ల‌డించారు.

అమరావతిలోని  సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బుధవారం పర్యటన, సాంస్కృతిక, యువజన సర్వీసులు శాఖ మంత్రిగా రోజా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మంత్రిగా బాధ్యతలు చేపట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు రోజా. మంత్రి హోదాలో గండికోట టు బెంగళూరు.. బెంగళూరు టు గండికోట బస్ సర్వీస్ ఫైల్‌పై తొలి సంతకం చేసినట్లు తెలిపారు.

పార్టీ పెట్టక ముందు నుంచి జగన్ అడుగు జాడల్లో నడిచాను.. మంత్రులుగా ఉన్న వాళ్లందరం జగన్ సైనికుల్లా పనిచేస్తామ‌ని అన్నారు.

మంత్రి వర్గంలో ఈక్వేషన్లను బేస్ చేసుకుని కేటాయింపులు జరిగాయన్నారు.. వైఎస్‌ జగన్ లాంటి నేతతో కలిసి నడవడం మా తమ అదృష్టమన్నారు. జగన్ పాలన చూసి అన్ని రాష్ట్రాలు మెచ్చుకుంటున్నాయ‌ని రోజా పేర్కొన్నారు.

పార్టీ కోసం జెండా పట్టుకొని నడిచిన ప్రతీ ఒక్కరికి సీఎం వైఎస్‌ జగన్‌ న్యాయం చేస్తున్నారని తెలిపారు.

ఏపీని బెస్ట్ టూరిస్ట్ ప్లేస్‌గా చేసేందుకు అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతాను అన్నారు.  సముద్ర తీర ప్రాంతాలను టూరిజం కోసం అభివృద్ధి చేస్తామన్నారు. దేశ విదేశీ టూరిస్టులను అనుకూలమైన టూరిజంను రాష్ట్రంలో రూపొందిస్తామని రోజా పేర్కొన్నారు.

అలాగే గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తామన్నారు. క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. క్రీడాకారులకు వసతులు కల్పిస్తామన్నారు. ఆర్టిస్ట్‌గా కళాకారుల సమస్యలు తమకు తెలుసని.. కళాకారులకు మంచి చేసేలా నిర్ణయాలు తీసుకుంటామని రోజా తెలిపారు.

పర్యాటకశాఖపై ఈ పది రోజుల్లో సమీక్షలు చేసి మళ్లీ మీడియా ముందుకు వస్తానన్నారు.

Related posts