telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ ఫోటోను షేర్ చేసిన రేణు దేశాయ్… ఆనాటి జ్ఞాపకాలతో…

renu

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘బద్రి’ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ రోజుతో 20 ఏళ్లు అయింది. ఈ సినిమా ద్వారానే తెలుగు తెరకి రేణు దేశాయ్ పరిచయమైంది. మూవీ షూటింగ్ సమయంలోనే పవన్, రేణు మధ్య ప్రేమ చిగురించగా.. ఆ తరువాత కొన్ని సంవత్సరాల పాటు సహజీవనం చేసిన వారు 2009లో పెళ్లి చేసుకున్నారు. కొన్ని కారణాల వలన 2012లో విడిపోయారు. ఈ నేపథ్యంలో ‘బద్రి’ సినిమా గురించి తాజాగా రేణు దేశాయ్ ప్రస్తావిస్తూ, ‘బంగాళా ఖాతంలో .. ‘అంటూ సాగే ఒక పాట షూటింగ్ సమయంలో తీసిన ఫొటోను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ఈబద్రి సినిమా షూటింగ్ సమయంలో తాను ఇబ్బంది పడ్డానని తెలిపారు. “విదేశాల్లో సిటీకి దూరంగా వుండే ఒక రిమోట్ ఏరియాలో బద్రి సినిమా షూటింగు జరిగింది. షాట్ గ్యాప్ లో అక్కడ కూర్చోవడానికి కూడా ఏమీ ఉండేవి కాదు. అక్కడ ఒక బండ వుంటే పవన్ దానిపై కూర్చున్నారు. నేను షార్ట్ స్కర్ట్ వేసుకున్న కారణంగా ఆ బండపై కూర్చోలేకపోయాను. ‘ఒక అమ్మాయి పక్కన నిలబడి ఉండగా కూర్చోవడం బ్యాడ్ మేనర్స్’ అంటూ కల్యాణ్ గారితో జోక్ కూడా చేశాను అని చెప్పుకొచ్చారు.

Related posts