నేడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 70వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరో దగ్గుబాటి రానా చేసిన ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. తన ట్విట్టర్ ఖాతా ద్వారా చంద్రబాబు నాయుడుకు విషెస్ తెలిపిన రానా.. ఎన్టీఆర్ బయోపిక్‌లో తాను పోషించిన చంద్రబాబు పాత్ర లుక్, రియల్ చంద్రబాబు లుక్ పక్కపక్కనే పెట్టి ట్వీట్ చేశారు. ఈ మేరకు ‘‘హ్యాపీ బర్త్ డే సర్. మీ పాత్రను పోషించడాన్ని ఒక గౌరవంగా భావిస్తున్నాను. మీరు ఎప్పటికీ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు. రానా చేసిన ఈ ట్వీట్ చూసి ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇకపోతే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ‘చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి’ అని ట్వీట్ చేశారు.
Happy birthday sir @ncbn was so exciting and an honor to portray a bit of you. Wishing you great health and happiness. pic.twitter.com/fhhaXu6E90
— Rana Daggubati (@RanaDaggubati) April 20, 2020