telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

విమానంలో ప్రయాణికుడికి మూర్ఛ… అత్యవసర ల్యాండింగ్… వైద్యం అందించిన డాక్టర్స్ కు షాక్

PLane

మెక్సికో సిటీ నుంచి టోక్యో వెళ్తున్న విమానం సొనోరా విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. విమానంలోని ఓ ప్రయాణికుడికి మూర్ఛ రావడంతో ల్యాండింగ్ చేసి వైద్యులను సంప్రదించగా.. ప్రయాణికుడు మరణించినట్టు వైద్యులు నిర్దారించారు. ఆటోస్పై ద్వారా ప్రయాణికుడు పొట్టలో కొకైన్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు అతని కడుపులో నుంచి 246 కొకైన్ ప్యాకెట్లను బయటకు తీశారు. 2.5 సెంటిమీటర్ల పొడవున్న కొకైన్ ప్యాకెట్లను కడుపులో పెట్టుకోవడం వల్ల ఓవర్ డోస్ అయి మెదడుకు వెళ్లడంతో అతను మరణించాడని వైద్యులు తెలిపారు. చనిపోయిన వ్యక్తి జపాన్‌కు చెందిన వ్యక్తి అని మెక్సికో నుంచి జపాన్‌కు అక్రమంగా డ్రగ్స్‌ను తరలించడానికి ప్రయత్నించినట్టు అధికారులు గుర్తించారు. శుక్రవారం రాత్రి రెండు గంటల ప్రాంతంలో వ్యక్తి చనిపోయినట్టు తెలుస్తోంది. డ్రగ్స్‌ను కడుపులో పెట్టుకుని అక్రమంగా తరలించడం ఈ మధ్య ఎక్కువైనట్టు అధికారులు తెలిపారు.

Related posts