telugu navyamedia
సినిమా వార్తలు

మహేష్ బాబు, అనిల్ రావిపూడిల “వాట్సాప్” ?

Mahesh Babu
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన “ఎఫ్-2” చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ లు హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా హిట్ తో అనిల్ రావిపూడికి మహేష్ బాబును డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ తాజాగా ఈ చిత్రానికి టైటిల్ ను రిజిస్టర్ చేశారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడి, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రానికి “వాట్సాప్” అనే టైటిల్ ను రిజిస్టర్ చేశారని అంటున్నారు. ప్రస్తుతం మన సమాజంలో “వాట్సాప్”కు ఎంత ఆదరణ ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ ఆధారణనే  బేస్ చేసుకుని అనిల్ రావిపూడి తన చిత్రానికి టైటిల్ గా మార్చాడని ఫిలిం నగర్ టాక్. ఇక దిల్ రాజు, అనిల్ రావిపూడి కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తారని తెలుస్తోంది. మరి ఇదంతా ఎంతవరకు నిజమో తెలియాలంటే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడేవరకు ఎదురు చూడాల్సిందే. 

Related posts