‘రత్నం’ స్వదేశీ కలాల తయారీలో కలికితురాయి. మహాత్మా గాంధీ పిలుపుమేరకు స్పందించి తయారైన మొట్టమొదటి స్వదేశీ కలం. రాజమండ్రికి చెందిన “రత్నం పెన్ వర్క్స్” అధినేత కె.వి రమణ మూర్తి చిన్నతనం నుండి తండ్రి వద్దనే కలం తయారీలో మెళకువలు అభ్యసిస్తూ 1981లో తండ్రి మరణించిన తర్వాత వారి మీద వున్న వాత్సల్యంతో మరియు సంస్థ మీద అలాగే స్వదేశీ వస్తువుల తయారీ మీద ఉన్న మమకారంతో ఇదే వృత్తిని కొనసాగిస్తూ జీవనోపాధిని పొందుతూ వచ్చారు.
బహుళ ప్రాచుర్యం పొందిన రత్నం కలాలను విదేశాలకు ఎగుమతి చేయడమే కాక పలు సంస్థల నుంచి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఆయన గత రాత్రి స్వగృహమందు తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. 1932 లో విదేశీ వస్తు బహిష్కరణకు ప్రభావితులై, ప్రారంభించిన స్వదేశీ వస్తు తయారీ ప్రస్థానంలో భాగంగా కలాల తయారీలో దేశంలోనే తమదైన చెరగనిముద్ర వేశారు.
– వై.మల్లికార్జునరావు
చంద్రబాబు సెక్యూరిటీ పై స్పందించిన డీజీపీ