telugu navyamedia
సినిమా వార్తలు

9 నెలల పాప క్లీవేజ్ షో చేసిందా ? : రష్మీ

Rashmi

“జబర్దస్త్” యాంకర్ రష్మీ గౌతమ్ ఒకవైపు షోలు చేస్తూనే, అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కన్పిస్తోంది. ప్రస్తుతం బుల్లితెరపై ఉన్న క్రేజీ యాంకర్లలో రష్మీ ఒకరు. ఇక ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడూ అప్డేట్ గా ఉంటూ తన అభిమానులతో చాట్ చేస్తూ ఉంటారు. ఇక సినిమాలు మాత్రమే కాకుండా పలు సామజిక అంశాలపైనా రష్మీ స్పందిస్తూ ఉంటారు. ఇటీవల తెలంగాణలోని వరంగల్ లో 9 నెలల పసికందుపై ప్రవీణ్ అనే కీచకుడు అత్యాచారం చేసి హత్య చేసిన వార్త సంచలనం సృష్టించింది. ఆ రాక్షసుడిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే తాజాగా ఈ విషయంపై యాంకర్ రష్మీ గౌతమ్ తీవ్రంగా స్పందించారు. ట్విట్టర్ లో రష్మి ఈ విషయమై ప్రస్తావిస్తూ “నరేంద్ర మోదీ సార్… మీరేమో బేటీ బచావో.. బేటీ పడావో (అమ్మాయిలను కాపాడండి.. అమ్మాయిలను చదివించండి) అంటున్నారు. కానీ అమ్మాయిలే మిగలకుంటే, బేటీ బచావో.. బేటీ పడావో ఎలా సాధ్యమవుతుంది?” అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రశ్నించారు.

తాజాగా ఇదే ఘటనపై ప్రశ్నలు సంధించారు రష్మీ. “ఆమె బట్టలు అసభ్యకరంగా ఏమైనా వేసుకుందా..? ఆమె క్లీవేజ్ షో ఏమైనా చేసిందా..? ఆమె తన కాళ్లను ఏమైనా చూపించిందా..? ఆమె తన అభిప్రాయాన్ని గట్టిగా చెప్పిందా..? ఏం చేసింది ఆమె ?” అంటూ ప్రశ్నించింది. రష్మి ట్వీట్ చూసిన నెటిజన్లు సదరు వ్యక్తిని పబ్లిక్ లో ముక్కలు ముక్కలుగా నరికేయాలని మండిపడుతున్నారు.

Related posts