telugu navyamedia
సినిమా వార్తలు

దేవిశ్రీ ప్రసాద్ తో పెళ్లి… క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Poojitha-Ponnada

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ద్వారా క్రేజ్ సంపాదించుకుని వెండితెరపై హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న తెలుగమ్మాయి పూజిత పొన్నాడ. “రంగస్థలం” సినిమాలో కీలక పాత్ర పోషించిన ఆమె “వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి” సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. తాజాగా ఆమె నటించిన “7′” సినిమా విడుదలైంది. అయితే “రంగస్థలం” సినిమా షూటింగ్ సమయంలో ఈ భామని స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ పెళ్లి చేసుబోతున్నట్లు రూమర్లు వినిపించాయి. వీరిద్దరూ చాల కాలంగా ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన పూజిత ఆ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. ‘రంగస్థలం’ సినిమా వంద రోజుల వేడుక ముందు వరకు తాను అసలు దేవిని ఒక్కసారి కూడా కలవలేదని చెప్పింది. దేవిశ్రీ సర్ తో పెళ్లి వార్తలు విని ఆశ్చర్యపోయినట్లు చెప్పింది. అసలు ఇలాంటి వార్తలు ఎవరు సృష్టిస్తారో తెలియదు కానీ ఏకంగా ఫొటోలే మార్ఫ్ చేసి పెట్టేస్తున్నారని చెప్పుకొచ్చింది.

Related posts