రత్నకుమార్ దర్శకత్వంలో అమలాపాల్ హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం “ఆమె”. తమిళంలో “ఆడై” టైటిల్ తో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను వీ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తుండగా చరిత చిత్ర, తమ్మారెడ్డి భరద్వాజలు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలవ్వగా అందులో నగ్నంగా కన్పించి అందరికీ షాకిచ్చింది అమలాపాల్. ఇక టీజర్ విషయానికొస్తే ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ వీక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రముఖులు సైతం సినిమా టీజర్ పై ప్రశంసలు కురిపించారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ సమస్యలు ఎదురైనట్టు తెలుస్తోంది. సినిమాలో బోల్డ్ సీన్స్ అన్నింటికీ సెన్సార్ కత్తెర వేయడానికి సిద్ధమవుతోందట. కొన్ని ట్రిక్స్ వాడి టీజర్ లో అమలాని న్యూడ్ చూపించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సినిమాలో కూడా ఇలాంటి సన్నివేశాలు కొన్ని ఉండడంతో వాటికి సెన్సార్ నో చెబుతోందట. ఈ సన్నివేశాలన్నింటినీ బ్లర్ చేసి చూపించాలని ఆదేశిస్తోందట. లేదంటే అలాంటి సన్నివేశాలకు కత్తెర పడే అవకాశం ఉందని అంటున్నారు.
previous post