బాలీవుడ్ లవ్‌బర్డ్స్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ముంబై బాంద్రాలోని కపూర్ల వారసత్వంగా వస్తున్న రణ్‌బీర్ ఇల్లు ‘వాస్తు’లో నేడు వీరిద్దరి వివాహం జరుగుతోంది. నిన్నరాత్రి సంగీత్ ఫంక్షన్ జరిగింది.

పెళ్లి వేడుకల్లో భాగంగా బుధవారం ఉదయం రణ్‌బీర్–ఆలియా ముందుగా పితృపూజ చేశారు. ఆ తర్వాత మెహందీ ఫంక్షన్ మొదలుపెట్టారు. ఇప్పటికే రణ్‌బీర్, ఆలియా కుటుంబ సభ్యులు, స్నేహితులు వివాహ వేడుక వేదిక వద్దకు చేరుకున్నారు.. దాదాపు 50 మంది ఇరు కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం జరగనుంది.
ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సందర్భంగా కాబోయే భార్య ఆలియా కోసం రణబీర్ ప్రత్యేకంగా ఓ బహుమతి తయారు చేయించారట. 8 వజ్రాలు పొదిగిన ఖరీదైన వెడ్డింగ్ బ్యాండ్‌ను పెళ్లిలో ఆలియా తన చేతికి ధరించనున్నారు. లండన్ నుంచి దీన్ని తెప్పించారని తెలుస్తోంది.
కాగా కపూర్ ఇంటి కుటుంబానికి 8 లక్కీ నంబర్ అట. మరోవైపు ఆలియాకు కూడా ఎనిమిది సంఖ్య లక్కీ నంబరు అని తెలిసింది. అందుకే కాబోయే శ్రీమతికి ఎనిమిది వజ్రాలు పొదిగిన బ్యాండ్‌ను రణ్‌బీర్ బహూకరించారని అంతా మాట్లాడుకుంటున్నారు.

ఘనంగా జరుగుతున్న ఈ పెళ్లి వేడుకకు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, వరుణ్ ధావన్, అయాన్ ముఖర్జీ, జోయా అక్తర్, అర్జున్ కపూర్, మసాబా గుప్తా, కరణ్ జోహార్, కరీష్మా కపూర్, కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. అందుకే కాబోయే శ్రీమతికి ఎనిమిది వ్రజాలు పొదిగిన బ్యాండ్‌ని రణ్‌బీర్ బహూకరించి ఉంటారు.

