telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మళ్ళీ తెరమీదకు పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్… త్వరలోనే అప్డేట్

Pui Jagannath

డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కు “జనగణమన” చిత్రం డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే అప్డేట్ ఉండబోతోందంటూ పూరీ కనెక్ట్స్ లో వచ్చిన పోస్టర్ ఒకటి వైరల్ అవుతోంది. “జనగణమన” దేశభక్తితో కూడిన కథ ఇది. అనేక కారణాల వలన వాయిదా పడుతూ వస్తున్నది. పోకిరి, బిజినెస్ మెన్ సినిమాల తరువాత మహేష్ బాబుతో జనగణమన చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. పూరికి సరైన హిట్స్ లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ పక్కన పడింది. అయితే, ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పూరి తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత జనగణమన ప్రాజెక్ట్ ఉంటుందని అంటున్నారు. అటు పూరి కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను త్వరలోనే స్టార్ట్ చేస్తానని చెప్పడంతో దీనిపై ఆసక్తి కలిగింది. అయితే, ఈ జనగణమన సినిమాలో హీరో ఎవరు అన్నది తెలియాల్సి ఉన్నది. మహేష్ బాబుతోనే సినిమా చేస్తాడా లేదంటే మరో హీరోతో సినిమా చేస్తాడో చూడాలి.

Related posts