బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా ‘తేజస్’. ఆర్ఎస్‌వీపీ ప్రొడక్షన్ బ్యానర్‌పై రోనీ స్క్రూవాలా నిర్మిస్తుండగా సర్వేష్ మేవారా దర్శకత్వం వహిస్తున్నారు. ‘తేజస్’ సినిమాలో యుద్ధ విమానం నడిపే పైలెట్ గా ఆమె కనిపించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ గాసిప్ బాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. విక్కీకౌశల్, ఆదిత్యాధర్ కాంబినేషన్‌లో వచ్చిన హిట్ సినిమా “యురి”కి సీక్వెల్‌గా “తేజాస్”ను రూపొందిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపై నిర్మాత రోన్నీ స్క్రీవ్ వాలా స్పందించారు. వాస్తవంగా జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ ఆధారంగా “యురి” సినిమా రూపొందించడం జరిగింది. కానీ “తేజాస్” అనేది ఫిక్షనల్ స్టోరి. కానీ “యురి” పంథాలోనే “తేజాస్” సినిమా ఉంటుందని ఆయన అన్నారు.
previous post
next post