telugu navyamedia
రాజకీయ వార్తలు

అయోధ్య ఆలయంలో ఉద్దవ్ ఠాక్రే పూజలు

udhav-thackeray shivasena

శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ఈ రోజు అయోధ్యను సందర్శించారు. 18 మంది శివసేన ఎంపీలతో కలిసి ఆయన అయోధ్యలోని రామ్ లల్లా ఆలయానికి వెళ్లారు. ఆలయ పండితులు వేదమంత్రోచ్చరణల మధ్య ఉద్దవ్ ఠాక్రే, ఎంపీలకు స్వాగతం పలికారు. రామమందిరంలో ఉద్దవ్ ఠాక్రే ఎంపీలతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేపు లోక్ సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాలకు ముందు రాముని ఆశీస్సులు తీసుకునేందుకు పార్టీ ఎంపీలతో కలిసి ఇక్కడి వచ్చామని తెలిపారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం వీలైనంత త్వరగా జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Related posts