telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

రాయదుర్గం నేపాలి గ్యాంగ్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..

cp sajjanar on disa accused encounter

రాయదుర్గం నేపాలి గ్యాంగ్ కేసులో సంచలన నిజాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ బయటపెట్టారు. ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడారు. రాయదుర్గం దోపిడీ కేసులో…నేపాల్ కు చెందిన నిందితులను అరెస్ట్ చేసి …20 లక్షల సొత్తు రికవరీ చేసామని పేర్కొన్నారు. నిందితులు మత్తు మందు కలిపి …మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులు మత్తులోకి వెళ్లేలా చేశారని తెలిపారు. మధుసూదన్ రెడ్డి భార్య కు పెద్దగా మత్తు రాలేదని…శైలజా రెడ్డికి మత్తు రాకపోవడంతో తీవ్రంగా కొట్టి కట్టేశారన్నారు. నేపాల్ కు చెందిన బహదూర్ షాహీ అలియాస్ నేత్ర దోపిడీకి సూత్రధారి కాగా నలుగురిని అదుపులోకి తీసుకున్నామని…మరో ఆరుగురు పరారీలో ఉన్నారని తెలిపారు.

జానకి అనే వంట మనిషి…ఆహారం లో మత్తు మందు కలిపిందని పేర్కొన్నారు. యూపీ, ఉత్తరాఖండ్ పోలీస్ ఉన్నతాధికారులు దోపిడీ ముఠాను పట్టుకునేందుకు సహకరించారని వెల్లడించారు. గతంలో రాయదుర్గంలో జరిగిన దోపిడీ తో పాటు బెంగళూర్ లో జరిగిన దోపిడీ లోనూ బహదూర్ షాహీ అలియాస్ నేత్ర నిందితుడు ఉన్నట్టు తెలిపారు. ఇంట్లో పనికి పెట్టుకునే ముందు…వారి గురించి ఆరా తీయాలి..గతం లో పని చేసిన ప్లేస్ లో ఎంక్విరీ చేయాలని సూచించారు. ఇంట్లోని అన్ని గధుల్లోకి పని మనుషులను రానివ్వొద్దని…నేపాల్ కు చెందిన పని మనుషులను కొన్ని ఏజెంట్లు తీసుకు వస్తున్నారని పేర్కొన్నారు. వారిపై విచారణ జరుపుతున్నామని కూడా సజ్జనార్ తెలిపారు.

Related posts