telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లపై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

RGV

లాక్ డౌన్‌లో క్లైమాక్స్, నగ్నం వంటి చిత్రాలతో బిజీగా ఉన్న వర్మ తాజాగా ప్రణయ్-అమృతల ప్రేమ కథను వాస్తవిక పరిస్థితుల ఆధారంగా ‘మర్డర్’ పేరుతో తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా యూట్యూబ్ ఛానల్స్‌కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు వర్మ. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్‌లపై వర్మ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ ఇద్దరి గురించి వర్మ మాట్లాడుతూ… “నా దృష్టిలో బెస్ట్ సీఎం అంటూ ఎవరూ లేరు కాని.. ఫ్యూచర్ సీఎం అంటే పవన్ కళ్యాణ్. అతని గురించి ఒక్క వర్డ్‌లో చెప్పాలంటే వెరీ టఫ్. అతను చాలా యునిక్. వన్ పీస్ అతడు. ఈ వర్డ్‌లోనే పవన్ కళ్యాణ్ సింగిల్ పీస్ అంటూ తెగ పొగిడేశారు వర్మ. ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ.. ‘సినిమాల పరంగా చిరంజీవి అంటే చాలా ఇష్టం. పొలిటీషియన్‌గా మాత్రం కాదు’ అని అన్నారు వర్మ. ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ‘జూనియర్ ఎన్టీఆర్ బెటర్ దెన్ సీనియర్ ఎన్టీఆర్’ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు వర్మ.

Related posts