telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రేణూదేశాయ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో…!

Renu

హీరోయిన్, క్యాస్టూమ్ డిజైనర్, డైరెక్టర్, రచయిత్రి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పుడూ ఎన్నో ఆసక్తికర అంశాలను పంచుకుంటారు. కొంతకాలం సినిమాలకు దూరమైన రేణూ దేశాయ్ మళ్లీ వెండితెర ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం రైతు సమస్యలపై ఓ సినిమాను రూపొందిస్తున్నారు. భర్తతో విడిపోయిన తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్ ‘ఇష్క్ వాలా లవ్’ అనే సినిమాకి దర్శకత్వం వహించింది. అంతేకాకుండా మంచి పాత్రలు వస్తే నటించడానికి రెడీగా ఉన్నానని ప్రకటించింది. రైతులపై సినిమా తెరకెక్కించాలని చూస్తున్నారు రేణు దేశాయ్. ఇప్పటికే రైతులను కలిసి వారి సమస్యలను వారి జీవన విధానం పై ఓ ప్రోగ్రాం కూడా చేసారు. రేణు దేశాయ్ రైతులపై సినిమా తీస్తా అని చెప్పి ఏడాది దాటింది. ఈ నేపథ్యంలో అసలు రైతులపై సినిమా ఉంటుందా లేదా అన్న డౌట్ అందరిలో మొదలైంది. తాజాగా ప్రముఖ రచయిత గోరేటి వెంకన్నను కలిసిన రేణు దేశాయ్.. ఆయనతో పాటలు రాయించుకుంటున్నట్లు ప్రకటించింది. ఇప్పుడిప్పుడే సినిమాలు స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఆమె కూడా తన సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.

Related posts