telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రానాతో రకుల్ డేటింగ్… స్పందించిన బ్యూటీ

Rana and Rakul

టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోయిన్ల సరసన అవకాశాలు కొట్టేస్తూ స్టార్ హీరోయిన్ల రేసులో కొనసాగుతోంది పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు, త‌మిళ, హిందీ భాష‌ల్లో వ‌రుస‌గా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది రకుల్. సినీ రంగంలోకి ప్ర‌వేశించి ద‌శాబ్దం కావొస్తున్నా ఇప్ప‌టికీ అదే గ్లామ‌ర్‌ను మెయింటైన్ చేస్తూ అవ‌కాశాలు అందుకుంటోంది. రకుల్ “వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్”తో తెలుగు వారికి దగ్గరైంది. ఆ తరువాత ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ మధ్య తాను నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో అవకాశాలు తగ్గాయి. దీంతో హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా అజయ్ దేవ్‌గన్‌తో ‘దేదే ప్యార్ దే’ అనే సినిమా చేసింది. ఆ మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే అదరగొట్టింది. ఢిల్లీకి చెందిన రకుల్ హైదరాబాద్‌లోనే స్థిరపడింది. నటుడు రానాతో ఈమె డేటింగ్ చేస్తోందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. వీరిద్దరూ తరచుగా బయట కలిసి కనిపిస్తుండడంతో ఈ వదంతులు మొదలయ్యాయి. తాజాగా ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రానాతో డేటింగ్ గురించి రకుల్ స్పందించింది. తానెవరితోనూ డేటింగ్‌లో లేనని స్పష్టం చేసింది. “నేను, మంచు లక్ష్మి, రానా క్లోజ్ ఫ్రెండ్స్. మా బ్యాచ్‌లో ఇంకా చాలా మంది ఉన్నారు. రానా ఇల్లు, నా ఇల్లు పక్కపక్కనే. నా కెరీర్ ప్రారంభం నుంచే రానా నాకు తెలుసు. ఆయన నాకు మంచి స్నేహితుడు మాత్రమే. నేను ఇప్పటివరకు సింగిల్‌గానే ఉన్నారు. నాకు ప్రేమించేంత సమయం లేదు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాను” అని రకుల్ స్పష్టం చేసింది.

Related posts