telugu navyamedia
రాజకీయ వార్తలు

చైనాతో మనం లడాయికి దిగాల్సి వస్తోంది: రాజ్ నాథ్

Rajnath singh Bjp

భారత జవాన్లను అడ్డుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. “ఈ కారణంతోనే చైనాతో మనం ‘లడాయి’కి దిగాల్సి వస్తోంది” అని వ్యాఖ్యానించారు. సరిహద్దుల్లో పెట్రోలింగ్ చేయకుండా భారత సైన్యాన్ని ఈ భూమిపై ఉన్న ఏ శక్తీ అడ్డుకోలేదనిఅన్నారు.

చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఎంపీలకు వివరించారు. నిన్న రాజ్యసభలో తన ప్రసంగ పాఠంలో లేని ‘యుద్ధ్’ అన్న పదాన్ని వాడి రాజ్ నాథ్ సంచలనానికి తెరలేపారు. శాంతిని మాత్రమే భారత్ కోరుకుంటుందని వెల్లడించారు.

ఇకపై భారత వైఖరి విభిన్నంగా ఉండబోతోందన్నారు. దేశంలోని 130 కోట్ల మందికి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా.. మన దేశం తలదించుకునే పరిస్థితిని మాత్రం తేబోమని అన్నారు. ఇదే సమయంలో మరెవరి ముందూ తలవంచబోము, మరెవరో మన ముందు తల వంచాలని భావించడమూ లేదని పేర్కొన్నారు. 

Related posts