telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

హైకోర్టు పెడితే నీళ్లు, ఉద్యోగాలు వస్తాయా?: అఖిల ప్రియ

bhuma akhila into ycp soon

ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఉండవచ్చని అసెంబ్లీలో జగన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి అఖిలప్రియ స్పందించారు. రాయలసీమ ప్రాంతంలో హైకోర్టును పెట్టినంత మాత్రాన నీళ్లు, ఉద్యోగాలు వస్తాయా? అనిఆమె ప్రశ్నించారు. సీమ ప్రజలు కోరుకుంటున్నది నీళ్లు, పరిశ్రమలని ఆమె అన్నారు.

జగన్ కు చిత్తశుద్ధి ఉంటే, తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి పథకాలను కొనసాగించాలని సూచించారు. హైకోర్టును మంజూరు చేసి, సీమను ఉద్దరించామని చెప్పవద్దని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిలో కొనసాగించాలని సలహా ఇచ్చారు. అనాలోచిత నిర్ణయాలు తీసుకుని ప్రజల జీవితాలతో జగన్ సర్కారు ఆటలాడుతోందని అఖిలప్రియ దుయ్యబట్టారు.

Related posts