సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు అనే వార్తలు గత కొద్దిరోజుల నుంచి విన్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయం పై ఆయన అత్యంత సన్నిహితుడు క్లారిటీ ఇచ్చారు. మొదట మార్చి 12వ తేదీన పార్టీని ప్రారంభిద్దామని రజనీకాంత్ భావించారని, కానీ అప్పటికే దేశంలో కరోనా విజృంభణ మొదలైందని అన్నారు. దాంతో పార్టీ ప్రారంభం వాయిదా పడిందన్నారు. తరవాత ఆగస్టులో పార్టీని లాంచ్ చేద్దామని అనుకున్నారని, కానీ పరిస్థితుల వల్ల ఆ నిర్ణయాన్ని కూడా వాయిదా వేశారన్నారు. అయితే నవంబర్‌లో మాత్రం ఖచ్చితంగా పార్టీ ప్రారంభమవుతుందని తియగరాజన్ ఓ జాతీయ న్యూస్ ఏజెన్సీతో తెలిపారు. ఇక ఈ ప్రకటనతో రజినీ పార్టీ పేరు, జండా ఏవిధంగా ఉండబోతోందనే చర్చ మొదలైంది.