ఆఖరి దశ పోలింగ్ లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఆదివారం జరగనుంది. అసలే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎన్నికల సంఘం తమ సిబ్బంది పట్ల చాలా జాగ్రత్తలే తీసుకుంటోంది. మధ్యప్రదేశ్‌లోని ఝాబువా జిల్లా ఎన్నికల అధికారి ప్రబాల్ సిపాహా వడదెబ్బకు సరికొత్త మందు కనిపెట్టారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల వంటి ఎన్నికల పరికరాలతో పాటు ఉల్లిపాయలను కూడా సిబ్బంది తమ వెంట తీసుకెళ్లాలని ఆయన ఆదేశించారు.
ఉల్లిపాయలు తీసుకుంటే దాహార్తి తీరుతుందని, డీ హైడ్రేషన్ సమస్య ఉండదన్న ఉద్దేశంతో ఆయన ఈ ఆదేశాలిచ్చారు. దీనితో ఆ జిల్లాలోని 981 పోలింగ్ కేంద్రాల సిబ్బంది తమ వెంట ఉల్లిపాయలను తీసుకెళ్లారు. అక్కడ 45డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. మేలో అక్కడ వడదెబ్బ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమయిన జిల్లా అధికారి ఎన్నికల సిబ్బంది వడదెబ్బ బారిన పడకుండా ఈ చిట్కా కనిపెట్టారు. మధ్యప్రదేశ్‌లోని ఎనిమిది లోక్ సభ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. దేవాస్, ఇండోర్, ఉజ్జయిని, మాంద్సౌర్, రత్లాం, థార్, ఖర్గోనె, ఖండ్వా అభ్యర్థుల భవితవ్యం రేపు తేలనుంది.
వైయస్ హయాంలోనే విశాఖ అభివృద్ధి: బొత్స